![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -487 లో.....కార్తీక్ ని శివన్నారాయణ బయటకు తీసుకొని వస్తాడు. నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడు దేనినైనా ఎదుర్కున్నాను కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు.. మోయలేని బాధ్యతలున్నాయి.. ఇప్పుడు నీ సపోర్ట్ కావాలని కార్తీక్ ని శివన్నారాయణ రిక్వెస్ట్ చేస్తాడు. నా కంపెనీని నువ్వే కాపాడాలి.. అలాగే మీ అత్తయ్య, మామయ్యలని నువ్వే కలపాలని అంటాడు. దానికి కార్తీక్ సరే అని మాటిస్తాడు.
అదంతా జ్యోత్స్న వింటుంది. వెనకాల నుండి దీప వచ్చి .. ఏంటి చాటుగా వింటున్నావ్.. నీతో మాట్లాడాలని పక్కకు తీసుకొని వెళ్తుంది. మరొకవైపు కాశీకి జాబ్ లేకపోవడంతో.. అందరు నన్ను తక్కువ చేసి చూస్తున్నారని ఫీల్ అవుతాడు. దాంతో రేపటి లోగా జాబ్ తెచ్చుకో లేదంటే నా బిజినెస్ చూసుకోమని కాశీతో శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత దీప హాల్లో సోఫాపై కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది. ఏంటి నా ముందే అలా కూర్చున్నావని జ్యోత్స్న కోప్పడుతుంది. నీ స్థాయి అది కాదు జ్యోత్స్న అని దీప ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటే.. దీపకి నిజం తెలిసిపోయిందేమోనని జ్యోత్స్న భయపడుతుంది. అంటే నువ్వు సీఈఓగా మంచి గా చెయ్యడం లేదు.. కాదు అది నీ స్థాయి కాదంటున్నానని దీప కవర్ చేస్తుంది.
ఆ తర్వాత దీప మాటలకి జ్యోత్స్న కోపంగా ఉంటుంది. దీప మాట్లాడింది మొత్తం పారిజాతానికి చెప్తుంది. జ్యోత్స్న అక్కడ నుండి వెళ్తుంది. కార్తీక్, దీప వెళ్తుంటే వాళ్లకి దార్లో అడ్డుపడి బావ నీతో మాట్లాడాలని అంటుంది. నేను మా బావని పంపించనని దీప అంటుంది. నా భార్య ఒప్పుకుంటే వస్తానని కార్తీక్ అంటాడు. దీప ఒక పది నిమిషాలు పంపించమని జ్యోత్స్న అడుగుతుంది. సరేనని దీప అనగానే కార్తీక్ , జ్యోత్స్న ఒక దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటారు నాకు బోర్డు మీటింగ్ లో నీ సపోర్ట్ కావాలని అడుగుతుంది. ఇంట్లో పెద్ద సమస్య ఉంది. అది వదిలేసి దీని గురించి ఆలోచిస్తావేంటి.. అసలు మావయ్య, అత్త మాట్లాడుకోవడం లేదు.. వాళ్ళని కలపడానికి నువ్వేం చేస్తున్నావని కార్తీక్ అడుగుతాడు. మా అమ్మనాన్నలని నేను కలుపుతానని జ్యోత్స్న ఛాలెంజింగ్ గా తీసుకొని ఇంటికి వెళ్తుంది. జ్యోత్స్న ఏం చేస్తుందో ఏమోనని జ్యోత్స్న వెనకాలే కార్తీక్ వెళ్తాడు. ఇంటికి వెళ్లి అమ్మనాన్న మీరు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |